శ్లోకం: నభూమి నజలం చైవ నతేజో నచవాయవః నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః సర్వశూన్య నిరాలంభౌ స్వయంభూ విశ్వకర్మణః మూలస్తంభం
భూమి, జలం, అగ్ని, గాలి, బ్రహ్మ, విష్ణు, శివుడు, నక్షత్రాలు లేకుండా అంతా శూన్యం గా ఉన్నప్పుడు తనకు తానుగా ఉద్భవించినవాడే విశ్వకర్మ. అంటే ఈ సృష్టి చరాచర జగత్తును పుట్టించిన వాడన్నమాట. అంటే విశ్వకర్మ భగవానునికి పుట్టుకలేదు. జయం తి అంటే పుట్టిన రోజు. పుట్టుకలేని విశ్వకర్మకు జయంతులేమిటి? ఇది శాస్త్రసమ్మతం కాదుగదా. వినాయక చవితి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఇలా పుట్టినరోజుకు తిథితో కలిపి పిలుస్తారు. పండుగ చేస్తారు. ఈ సృష్టి కన్యా సంక్రమణం రోజున ప్రారంభమైందని వేదా లు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున ఈ సృష్టికి కారకుడైన విశ్వకర్మ మహాప్రభువును స్మరించుకుంటూ వైదిక ధర్మం ప్రకారం యజ్ఞం చేయాలి. అందుచేత “విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం” అనడం ధర్మసమ్మతం.
కన్యా సంక్రమణం అనేది సూర్య సిద్ధాంతం ప్రకా రం వస్తుంది. ఇది కచ్చితంగా సెప్టెంబర్ 17నే వస్తుంది. ఈ మధ్య పండితులు, పామరులు, తెలిసినవారు, తెలియనివారు అంద రూ విశ్వకర్మ జయంతి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. జయంతి అనడం ఏమాత్రం మంచిది కాదు. ధర్మశాస్త్రాలు అంగీకరించవు. మన ఔన్నత్యాలను మనమే నాశ నం చేసుకున్నట్లు అవుతుంది. జయంతి ఎందుకు అనకూడదో తెలిసింది కదా! మనమందరం ఇకముందు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవమనే చెప్పుకొని మన కుల ఔన్నత్యాన్ని ప్రోదిచేసుకుందాం.