calender_icon.png 5 January, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటిగంటకు ముగించాల్సిందే

31-12-2024 02:24:38 AM

  • తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా

డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి ఫ్లుఓవర్ల మూసివేత

ట్యాంక్‌బండ్‌పై నో సెలబ్రేషన్స్

న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి): న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచ  పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే రూ.10వేల జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. వేడుకలను రాత్రి ఒంటిగంట  ముగించాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు.

డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని ఫ్లుఓవర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలు, ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతిస్తామన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.

మితిమీరిన శబ్దాలు కలగజేసే మోడిఫైడ్ సైలెన్సర్లు, హారన్స్, మ్యూ  సిస్టమ్స్ కలిగి ఉంటే వాహన యజమానితో పాటు వాహనాన్ని ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. మద్యం సేవించిన వారికి పబ్‌లు, బార్ల యజమానులు ప్రైవేట్ వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని పోలీసులు సూచించారు.

క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు, ఆపరేటర్లు ఖచ్చితంగా తమ యూనిఫామ్ ధరించాలని సూచించారు. దీంతో పాటు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో న్యూ ఇయర్ వేడుకలను నిషేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రజలెవరూ అటువైపు రావొద్దని సూచించారు.