calender_icon.png 17 March, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి

17-03-2025 12:59:40 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, మార్చి 16(విజయక్రాంతి): వేసవిలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యుత్తు శాఖ అధికారులకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మంబోజిపల్లి  ఏరియాలో 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా ఇన్ పుట్, ఔట్ పుట్  గురించి,  ట్రాన్స్ ఫార్మర్లు, ఫీడర్ల గురించి విద్యుత్ శాఖ ఎస్సీ శంకరును అడిగి తెలుసుకున్నారు.   నిరంతరాయ విద్యుత్ అందించడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని, పెరుగుదలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు.

వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశమున్నందున, ముందస్తు ప్రణాళికలతో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, ఇతర సాంకేతిక పరంగా ఎదురయ్యే అంశాలలో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని తెలిపారు. అదనపు ట్రాన్స్ఫా ర్మర్లు సిద్ధంగా ఉంచడం, లోడ్ మేనేజ్మెంట్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలను అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో 33/11 కెవి ఉప విద్యుత్ కేంద్రాలు 126 ఉన్నాయని, వాటి పరిధిలో ప్రతి రోజు విద్యుత్తు వినియోగం నమోదులు చేయాలని ఆదేశించారు. సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా వ్యవసాయ, పారిశ్రామిక, గృహ వినియోగ దారులకు అంతరాయం లేకుండా 24 గంటలు నిరంతరం సరఫరా ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తు శాఖ ఎస్.ఈ శంకర్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.