దౌల్తాబాద్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీఆర్ డిఓ పిడి జయదేవ్ ఆర్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ వ్యాపారులకు దాన్యం విక్రయించి రైతులు నష్టపోవద్దని సూచించారు. అధికారులు, రైతులు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినిలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఆరోగ్య సమస్యలు రాకుండా పౌష్టికా ఆహారం అందించాలని సూచించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నర్సరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాజు, ఎంపీఓ సయ్యద్ గపూర్ ఖాద్రి, ఎపిఎం యాదగిరి, సీసీ విజయలక్ష్మి, సిఏ రజిత తదితరులు పాల్గొన్నారు.