calender_icon.png 19 November, 2024 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

19-11-2024 06:29:25 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలి అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి ధాన్యం కేంద్రానికి ఎంత వచ్చిందని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సన్నపు, దొడ్డు ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు.

అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు. ధాన్యము కుప్పలు మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. రైతులు ధాన్యమును పొల్లు లేకుండా ఉంచాలని రైతులకు సూచించారు. మిట్టపల్లి, హాజీపూర్ కేంద్రంలో తూకం వేసే యంత్రాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని కర్ణమామిడి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యము బస్తాలను స్వయంగా పరిశీలించారు. తేమ వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు వేగవంతంగా కొనుగోలు చెయ్యాలని ఐకేపీ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు.

సన్నలకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్‌ ఇస్తుందన్నారు. ధాన్యం తూకం వేసిన వెనువెంటనే  రైస్ మిల్లులకు తరలించాలని కోరారు. కొన్ని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారని, 17 శాతం తేమ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లలకు తరలిస్తున్నారని తెలిపారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని 17  శాతం తేమ మించకుండా కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, తదితరులు పాల్గొన్నారు.