calender_icon.png 1 March, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లవాగు ప్రాజెక్టులోని నీటిని నాలుగు గ్రామాలకు అందేలా చూడాలి

01-03-2025 07:17:24 PM

సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు(సుల్తానాబాద్) ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ, రైతులు నీటి కొరతతో తమ పంటలను ఎండబెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ... జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ ఆధ్వర్యంలో నల్లవాగు ప్రాజెక్టు ఆనకట్టపై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ... నాలుగు గ్రాములకు నీరు అందేలా చూడాలన్నారు. నల్లవాగు కాలువ నుండి నాలుగు గ్రామల పంటకు నీటి కొరత ఉందని కృష్ణపూర్, మార్డి, ఇంద్రనాగర్, కల్హేర్ జొన్న పంట కొరకు నీటిని విడుధల చెయ్యాలన్నారు. నీటి విడుదల కొరకు ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి, ఎంపీ సురేష కుమార్ షట్కర్ ని రైతులకు ఆడుకోవాలన్నారు. రైతే దేశానికి వెన్ను మొక్క లాంటి వారన్నారు.

నల్లనాగు ప్రాజెక్టుకి 4000 ఎకరాల పంట ఉండగా దానికి 2500 ఎకరాలు జొన్న పంట ఉందన్నారు. ఒకొక్క రైతు ఒక ఎకరానికి సుమారు 20-25 క్వింటల్ పంటను పందిస్తారన్నారు. రైతులకు తక్షణ సాయం అందించాలని, ప్రాజెక్టు నీటిని సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని, రైతులకు తక్షణ సహాయం అందించాలని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీరు అందక రైతుల పంట నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. రైతుల పంటకు నీరు అందేలా అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే సహకరించాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ ఎలాంటి రాజకీయం కాదని రైతుల కొరకు మాత్రమేనని గుర్రపు మచ్చేందర్ అన్నారు. మాజీ రాష్ట్ర ఆత్మ కమిటీ డైరెక్టర్ అనుముల మారుతి, ర్యాలమడుగు మాజీ ఎంపిటిసి అమ్రేనాయక్, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, నాగిరెడ్డి, అనుమల తుకారాం, గుఱ్ఱపు నర్సింలు, పరశురాం రెడ్డి, అశోక్, నగేష్, సురేష్, విజయ్ రాజు, కిషన్ సింగ్, శ్రీనివాస్, అభి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.