calender_icon.png 24 October, 2024 | 12:53 AM

ప్రజలకు కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలి

23-09-2024 12:00:00 AM

తగిన మోతాదుల్లో క్లోరిన్ ఉండేలా చర్యలు చేపట్టాలి

అధికారులకు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రిజర్వాయర్ల నుంచి వినియోగదారులకు సరఫరా చేసే నీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధి కారులకు సూచించారు. రాబోయే రెం డు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యం లో జలమండలి డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలతో ఎండీ అశోక్‌రెడ్డి ఆదివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు.

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల వల్ల కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యే క దృష్టి సారించాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించి, క్లోరిన్ బిళ్లలు పంపిణీ చేయాలని సూచించారు. అవసరమైన ప్రాం తాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే గుర్తించిన వాటర్ లాగింగ్ కేంద్రా ల్లో ఈఆర్టీ బృందాలు అందుబాటులో ఉండాలని, ఎయిర్‌టెక్ మిషన్లతో సివరేజీ సమస్య లు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి చేపట్టే ఇంకుడు గుంతల నిర్మాణం, పునరుద్ధరణ స్పెషల్ డ్రైవ్ కోసం సిద్ధం కావాలని ఆదేశించారు.