calender_icon.png 21 April, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలి

27-08-2024 02:38:36 AM

సీఎం రేవంత్‌రెడ్డికి మాల ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డికి మాల సామాజికవర్గం ప్రజాప్రతినిధులు కోరారు. సోమవారం సచివాలయంలో రేవంత్‌రెడ్డిని ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మట్టా రాగమయి, వంశీకృష్ణ, నాగరాజు, మాల మహానాడు నేత చెన్నయ్య తదితరులు కలిశారు. ఎస్సీ వర్గీకరణపై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మాల, మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తిచేశారు. కమిటీని నియమించి ఆ నివేదిక ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.