- సర్వే పూర్తికి కుల సంఘాలు చొరవ చూపాలి
- బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సామాజిక బాధ్యతగా భావించి సమాచారాన్ని ఇవ్వాలని బీసీలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సర్వేలో పాల్గొనని వారు కూడా సమా చారం ఇచ్చేలా కుల సంఘాలు చొరవ తీసుకోవాలన్నారు.
శుక్రవారం సెక్రటేరియట్‌లో బీసీ సం క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయ ప్రకాశ్ , తిరుమలగిరి సురేందర్, భాగ్యలక్ష్మి సమావేశమై సర్వేపై మంత్రికి వివరించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్వేలో పల్లె ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.
కులాల వారీగా సంఖ్య తగ్గింతే.. రావాల్సిన పథకాలు కూ డా తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రతినిధు లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు, సమాజాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన వారు సర్వేలో భాగస్వాములు కావాలన్నారు. సర్వేలోని సమాచారం ఆధారంగా నే ప్రభుత్వం నూతన పథకాలను అమలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సర్వేలో చురుగ్గా పాల్గొనాలని కోరారు.
అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది: బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
సర్వే సంపూర్ణంగా జరిగినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. వివరాలు పూర్తిగా సేకరించకుంటే ప్రజలకే నష్టం జరుగుతుందన్నారు. సమాజంలో ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారో తెలుసుకుంటేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు.
బీసీలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సర్వేనే ఆధారం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని అన్ని కాలనీ సంఘాలు కులగణనలో పాల్గొనాలని చెప్పారు. కొన్ని కాలనీల్లోని ప్రజలు సమాచారం ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారన్నారు.
కులాల పేర్ల మార్పుపై అభిప్రాయాల స్వీకరణ
కులాల పేర్ల మార్పపై వచ్చిన విజ్ఞప్తుల మేరకు శుక్రవారం బీసీ కమిషన్ కార్యాలయంలో అభిప్రాయాలను స్వీకరించారు. బుడబుక్కల, మేర, కుమ్మరి, రజక సంఘాల ప్రతినిధులు బీసీ కమిషన్ ఎదుట హాజరై తమ కులాల పరిస్థితిని వివ రించారు.
బుడబుక్కల ప్రతినిధులు తమ కులా న్ని క్షత్రియజోషిగా మార్చాలని, కుమ్మరి కులస్తు లు ప్రజాపతిని పర్యాయపదంగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బుడబుక్కల కులప్రతినిధులు ఆవుల మహేశ్, లక్ష్మణరావు, మేర కులం నుంచి సంగ వెంకట రాజం, సంతోష్, కుమ్మరి కులం నుంచి బాలకిషన్ ప్రజాపతి పాల్గొన్నారు.
మాది సెక్యులర్ ప్రభుత్వం
- రవాణా శాఖ మంత్రి పొన్నం
- సెక్రటేరియట్‌లోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): సెక్రటేరియట్ ప్రాంగణంలోని చర్చి లో సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా బ్రదర్ అనిల్‌తోపాటు క్రిస్టియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ ప్రత్యేక ప్రార్థనలు చేసి మంత్రికి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడు తూ.. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అన్ని మ తాలను సమానంగా చూస్తుందన్నారు. త్యాగానికి మారుపేరుగా యేసు నిలిచారన్నారు. రా ష్ట్రంలోని రైతులకు పాడి పంటలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు.