16-04-2025 12:00:00 AM
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల2’. సంపత్ నంది పర్యవేక్షణలో దర్శకుడు అశోక్‌తేజ తెరకెక్కించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకాలపై డీ మధు నిర్మించారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 17న విడు దల కానున్న ఈ సందర్భంగా ఈ మూవీ మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్టార్ హీరో శర్వానంద్ ముఖ్యఅతిథిగా, డైరెక్టర్ వశిష్ఠ, ప్రొడ్యూసర్ రాధామోహన్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో హీరో శర్వా మాట్లాడుతూ.. “ఈ సినిమాకు ఏదో అద్భుతం జరగబోతోంది. తమన్నాను హీరోయిన్ అని పిలవడం నాకు ఇష్టం లేదు.. తను అద్భుతమైన నటి’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ.. ‘20 ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్లలో పనిచేశా. కానీ ఇంత పాషన్ ఉన్న ప్రొడ్యూసర్, క్రియేటర్స్ చాలా అరుదుగా ఉంటారు.
శర్వానంద్, నేను ఎప్పుడూ కలుసుకోలేదు. ఆయనతో నటించాలనుంది’ అని చెప్పారు. సంపత్ నంది మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమా చేయాలంటే చాలా రీసెర్చ్ వర్క్ కావాలి. అందుకోసం నాకు ఎన్నో పుస్తకాలు రిఫర్ చేసిన అందరికీ థాంక్యూ’ అని తెలిపారు. డైరెక్టర్ అశోక్‌తేజ మాట్లాడుతూ.. ‘తమన్నాతో ఒకసారి సినిమా చేస్తే మళ్లీమళ్లీ చేయాలనిపిస్తుంది’ అన్నారు. ‘మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధం ఈ సినిమా’ అని నిర్మాత డీ మధు అన్నారు. మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.