11-03-2025 12:27:51 AM
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాల ల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి నగదు రూ పంలో ఫీజులు వసూలు చేసి వాటికి రశీదులు ఇవ్వకుండా భారీగా ట్యాక్స్‌లు ఎగ్గొ ట్టినట్లు గుర్తించిన అధికారులు ఈ సోదా లు నిర్వహించినట్లు సమాచారం.
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేసి వాటి ద్వారా లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీం తో దేశవ్యాప్తంగా కాలేజీలపై ఐటీ అధికారులు దాడులుని ర్వహించారు. అందు లో హైదరాబాద్ మా దాపూర్ శ్రీ చైతన్య కాలేజీలోనూ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు.
అయితే కొంతకాలంగా ఈ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్ప డుతుండటంతో పలువురు తల్లిదండ్రులు రాష్ర్ట ప్రభుత్వాలకు, కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఫీజుల విషయంలోనూ ఫిర్యాదులు అందడంతోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏకకాలంలో దేశంలోని పలు నగరాల్లో ఉన్న ఈ కాలేజీలపై దాడులు నిర్వహించినట్లు తెలుస్తోం ది.
ఈ దాడుల్లో పలు కాలేజీలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమ తులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు తేలినట్లు సమాచారం. అంతేగాక పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించినట్లు తెలి సింది.
మాదాపూర్‌లోని శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీతోపాటు మరికొన్ని కేంద్రాల్లోని కాలేజీల రికార్డులు, డా క్యుమెంట్లు, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపు రశీదులను పరిశీలించారు. డైరెక్టర్ల కార్యాలయాలనూ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
రూ.2.5 కోట్లు నగదు స్వాధీనం?
ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చైతన్య విద్యాసంస్థలపై రెండుసార్లు ఐటీ దాడులు నిర్వహించగా మరోసారి దాడులు చేయడం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాలతోపాటు సుమారు 30 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. కార్పొరేట్ ఆఫీసులోనే దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మొత్తంగా కార్పొరేట్ కళాశాలల సెంట్రల్ ఆఫీస్‌లపైనే ఐటీ సోదాలు జరిగినట్లు తెలిసింది. విద్యార్థుల ఫీజుల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలకు సంబంధించిన న్యాయబద్ధంగా కట్టాల్సిన పన్ను ఎగవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత కొంతకాలంగా శ్రీ చైతన్య కాలేజీల్లో జరుగుతున్న అడ్మిషన్లు, వ్యాపార లావాదేవీల్లో వెల్లడించిన వివరాలు వేరేగా ఉన్నాయని ఆరోపణలున్నాయి.
దీంతో పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే..ఐటీ అధికారులు రంగంలోకి దిగి ఈ సోదాలు నిర్వహించి కంప్యూటర్స్ హార్డ్ డిస్క్, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో తెల్లవారుజామున నుంచే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి.
రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ల నివాసాలు, హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. కళాశాలల యజమాన్యాలు వెల్లడించిన వివరాలు, సోదాల్లో లభించిన వివరాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం.