హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఆదాయపు పన్ను (Income Tax Department) అధికారులు నాలుగోరోజూ సోదాలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం నాడు ఐటీ అధికారులు దిల్ రాజు ఇంటికి మరోసారి వెళ్లారు. మహిళ అధికారి ఆధ్వర్యంలో తీనిఖీలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో మంగళవారం నుంచి సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు దిల్ రాజు(Dil Raju) సోదరుడు శిరీశ్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. దిల్ రాజు ఇంట్లో నిర్వహించిన సోదాల్లో 21 మంది అధికారుల బృందం పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులపై జరిగిన దాడులు సోషల్ మీడియా, తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలో పేరుగాంచిన దిల్ రాజు ఇటీవల రెండు ప్రధాన సంక్రాంతి ప్రాజెక్టు(Sankranti projects)లను విడుదల చేశారు.
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్(Ram Charan game changer), వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అదనంగా, బాలకృష్ణ నటించిన డాకు మహారాజు సినిమా(Daaku Maharaaj movie) నైజాం పంపిణీ హక్కులను దిల్ రాజు పొందాడు. ఈ చిత్రాల ద్వారా వచ్చే ఆదాయాలపై సరైన పన్నులు చెల్లించారా లేదా అనే దానిపై ఐటీ అధికారులు తమ దర్యాప్తును కేంద్రీకరించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, వాటి లావాదేవీల ఆర్థిక పరిశీలనతో పాటు మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)కు చెందిన నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌తో సహా ప్రముఖ వ్యక్తుల ఇళ్ళు, కార్యాలయాలలో కూడా సోదాలు జరిగాయి. అభిషేక్ అగర్వాల్, దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, నిర్మాత శిరీష్, దర్శకుడు సుకుమార్ ఇళ్లపై కూడా అధికారులు దాడులు నిర్వహించారు.