మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఆరుగురు కొత్తమం త్రులను నిర్ణయించలేని దౌర్బాగ్య స్ధితిలో కాంగ్రెస్ ఉందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ... మంత్రివర్గంలో సామాజిక సమతూకం పాటించడంలేదని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకు నే నీచ చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. రాష్ట్ర పాలన గాలికి వదిలేసి, పాలకులు ఢిల్లీలో మకాం వేసి సొంత ప్రయోజనాల కోసం పైరవీలు చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేద ని మండిపడ్డారు.
నిరుద్యోగులను కాంగ్రెస్ ముంచింది: బాల్క సుమన్
నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి, బ ల్మూరి వెంకట్‌కు ఉద్యోగం వచ్చిందని, నిరుద్యోగులు ఆందోళన చేస్తు న్నా పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపితే పోలీసులతో బెదిరిస్తున్నారని, ఇదే విధం గా వ్యవహరిస్తే నిరుద్యోగుల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిం చారు. ఏపార్టీ మద్దతు లేకుండా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని, గురు శిష్యుల సమావేశం తెలం గాణ వనరుల దోపిడీ కోసమే అని ఆరోపించారు.