calender_icon.png 25 January, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌ జోరు వర్షం

08-09-2024 03:29:50 PM

హైదరాబాద్: హైదరాబాద్‌లో పలుచోట్ల ఆదివారం జోరుగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, ఫిలింనర్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.  భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలోని అనేక జిల్లాలకు సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.