హైదరాబాద్,(విజయక్రాంతి): నగర వ్యాప్తంగా పలుచోట్ల మంగళవారం ఐటీ అధికారులు దాడులు(IT Officials Raids) నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామునుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా హైదరాబాద్‌లో 8 చోట్ల ఏకకాలంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు(Income Tax Department officials) 55 బృందాలు విడిపోయి అనేకచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్వీసీ, మైత్రి చిత్ర నిర్మాణ సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయం, దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సిత రెడ్డి, ఆయన వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుష్ప-2 చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.