calender_icon.png 18 October, 2024 | 2:01 PM

హైదరాబాద్‌లో 30 చోట్ల ఐటీ దాడులు

18-10-2024 02:42:36 AM

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): గతకొన్ని రోజులుగా హైదరా బాద్‌లోని ప్రముఖ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఐటీదాడులు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున నగరంలో పలు చోట్ల ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. పటాన్‌చెరు సమీపంలోని కొల్లూరుతోపాటు రాయదుర్గంలో ఐటీ అధికా రులు విస్తృతంగా సోదాలు జరిపారు.

రాయదుర్గంలోని అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుత్‌రావు ఇంట్లో, గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వీరికి సంబంధించిన కంపెనీలలో పనిచేసే ముఖ్య మైన ఉద్యోగులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు.

నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ 30 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేసి నట్లు సమాచారం. కోట్లాది రూపాయ ల వ్యాపారం చేస్తూ భారీగా గడిస్తున్నా పన్ను ఎగ్గొడుతున్నట్లుగా ఐటీశాఖ గుర్తించి జాబితా తయారు చేసుకొని మరీ దాడులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారుల లిస్ట్ మేరకు త్వరలో మరిన్ని ఐటీ దాడులు జరుగనున్నాయని సమాచారం.