calender_icon.png 24 September, 2024 | 1:45 PM

హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ దాడులు

24-09-2024 11:22:02 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): నగరంలో ఐటీ సోదాలు మంగళవారం ఉదయం నుంచి అలజడి రేపుతున్నాయి. తాగా హైదరాబాద్ లోని  ఏడు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 10 బృందాలుగా ఏర్పాడి రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారుల ఇడ్లపై దాడులు చేస్తున్నారు. కూకట్ పల్లిలోని రెయిన్ బో విస్టాస్, 'ఐ' బ్లాక్ లో అద్దెకుంటున్న బీఆర్కే న్యూస్  ఛానల్, ఫైనాన్స్, హాస్పిటల్ నిర్వహిస్తున్న బొల్ల రామకృష్ణ చౌదరి నివాసం లో ఐటీ సోదాలు కోనసాగుతున్నాయి. దాదాపు 8 మంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఐటీ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం పూర్తిగా తెలియాల్సి ఉంది.