30-03-2025 04:35:30 PM
దత్త గుడిలో పూజలు..
కాటారం (విజయక్రాంతి): ఉగాది పండుగ పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం స్వగ్రామమైన ధన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu) ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వగృహంలో ఉగాది పచ్చడి సేవించారు. గ్రామస్తులకు పంపిణీ చేశారు. దత్త గుడిలో పంచాంగం పటనం, శ్రవణం చేశారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో ఎడ్లకు పూజలు నిర్వహించి, వ్యవసాయ క్షేత్రంలో సాగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయంగా నాగలి పట్టి వ్యవసాయ భూమిలో దుక్కులు దున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.