ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): సమస్యలపై మద్దతుగా దీక్ష చేసే, స్పందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై వారికి నైతిక మద్దతునిస్తూ దీక్ష చేస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. పరీక్షలు రాసే వారే దీక్ష చేయాలని సీఎం రేవంత్ అనడం దుర్మార్గంగా ఉందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ దీక్షలు చేస్తే అలాగే చేశారా.. అని ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడు తూ.. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలోనూ నిరుద్యోగుల సమస్యల పై టీజీఎస్‌పీఎస్సీ వద్ద ఆందోళన చేస్తే వారిని నిర్బంధించారని.. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘనత రేవంత్‌రెడ్డిదని మండిపడ్డారు.