calender_icon.png 29 December, 2024 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎంఏ నిబంధనల పేరుతో దాడులు జరగడం దురదృష్టకరం

28-12-2024 10:10:29 PM

ఎమ్మెల్సీ కోదండరాం...

నిజామాబాద్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వైద్య సేవలు లేని పరిస్థితుల్లో స్థానికంగా ఉంటూ ఎన్నో ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ వైద్య చికిత్సలు అందించే పీఎంపీల సేవలు అద్భుతం అని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. నిజామాబాద్ నగరంలో జరిగిన పీఎంపీల జిల్లా సభ కార్యక్రమనికీ శనివారం ఆయన హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఐక్యంగా ఉన్నప్పుడే పీఎంపీలపై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చని గ్రామీణ స్థాయిలో వైద్యం అందరిని మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న పీఎంపీలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు. ఐఎంఏ నిబంధనల సాకుతో పీఎంపీలపై కొందరు దాడులు చేయడం సరైనది కాదన్నారు. 

మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న పీఎంపీలు లేకపోతే గ్రామాల్లో ప్రజలు ఉండేవారు కాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఆర్ఎంపి పి.ఎం.పి వైద్యులు కలిసికట్టుగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఆర్.ఎం.పి పి.ఎం.పి లపై జరిగే దాడులను ఎదుర్కొనవచ్చని కలిసికట్టుగా ఉండాలని పిఎంపి ఆర్ఎంపీలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ వ్యవస్థాపకులు పులగం మోహన్, జన విజ్ఞాన వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి, అసోసియేషన్ కార్యవర్గం రమేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.