calender_icon.png 12 October, 2024 | 5:54 PM

వడ్డీ రేట్ల కోతకు వేళయ్యింది

24-08-2024 12:30:00 AM

ఫెడ్ చైర్మన్ పొవెల్

జాక్‌సన్‌హోల్ (యూఎస్), ఆగస్టు 23: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు, ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లు, ఇన్వెస్టర్లు, రుణగ్రహీతలు కొద్దివారాల నుంచి వేచిచూస్తున్న తీపికబురు జాక్‌సన్‌హోల్ సింఫోజియం నుంచి వెలువడింది. వడ్డీ రేట్ల తగ్గించే సమయం వచ్చిందని యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ప్రకటించారు. యూఎస్‌లోని జాక్‌సన్‌హోల్ ఆర్థిక వేత్తల వార్షిక సదస్సులో శుక్రవారం పొవెల్ ప్రసంగిస్తూ జాబ్ మార్కెట్ మరింత దిగజారేందుకు అనుమతించబోమని, ద్రవ్యోల్బణం తమ లక్ష్యం 2 శాతానికి చేరువవుతున్నందున తమ ద్రవ్య విధానాన్ని సడలిస్తామన్నారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు సన్నగిల్లాయని, ఉపాధి రిస్క్‌లు పెరిగాయని పొవెల్ చెప్పారు. తమ దిశ (వడ్డీ రేట్ల తగ్గింపు) స్పష్టమయ్యిందని, తగ్గించే సమయం, రేట్ల కోత వేగం అనేది రానున్న ఆర్థిక గణాంకాల ఆధారంగా ఉంటుందన్నారు.