23-02-2025 07:49:35 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం చందాయి పేట్ గ్రామంలో ఘనంగా శ్రీ మల్లికార్జున స్వామి ఏడవ వార్షికోత్సవం యాదవ కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యాదవల కులదైవమైన మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా ప్రతి ఏటా మాఘమాసం ముందర పండుగ జరుపుకుంటామని తెలియజేశారు. ఉదయం నుండి మల్లన్న ఆలయంలో హోమం ప్రత్యేక పూజలు, నిర్వహించి, గంగకు పోవడం జరుగుతుందని, సాయంత్రం గ్రామంలో ఉన్న యాదవ్ ల ప్రతి ఇంటి నుండి స్వామి వారికి గంపలు, బోనాలు, ఒగ్గు కళాకారుల చేత నృత్య ప్రదర్శనతో గుడి వద్దకు చేరుకొని స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహం పొందడం జరుగుతుందని ఆలయ నిర్వాణ కార్యకర్తలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, నిర్వహణ కార్యకర్తలు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.