05-04-2025 01:21:53 AM
అన్మాస్ పల్లిలో తొలి తెలంగాణ విత్తన పండుగ ప్రారంభం
నేడు, రేపు కొనసాగనున్న వేడుకలు
పలు రాష్ట్రాల దేశీ విత్తనాల ప్రదర్శన
కడ్తాల్, ఏప్రిల్4 (విజయక్రాంతి) : రైతును రాజును చేసేది విత్తనమేనని రాష్ట్ర విత్తనాభివృద్ధిసంస్త చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ తొలి విత్తన పండుగకు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని ఆన్మాస్పల్లి గ్రామ సమీ పంలోని ఎర్త్ సెంటర్ వేదికైంది. శుక్రవారం విత్తన పండుగను అన్వేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు పద్మారెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, సిజిఆర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో విత్తన పండుగ ఈ నెల 6 వరకు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యానికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మని.. దేశీ విత్తనాల ప్రదర్శన, ఉచిత పంపిణీ, విక్రయాలకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ విత్తనాల వైభవాన్ని తెలియజేసేందుకు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు వారు.
పేర్కొన్నారు. రైతులు, పాలసీ మేకర్స్ని ఒకే వేది కపైకి తీసుకురావడమే లక్ష్యమని ప్రొఫెసర్ పురు షోత్తం రెడ్డి చెప్పారు. వ్యవసాయ, పర్యావరణ నిపుణులతో పాటు, పాలసీ మేకర్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎర్త్ సెంటర్లో మరో రెండు రోజులు నిర్వహించనున్న విత్తన పండుగకు సంబంధించి కేరళ, తమిళనాడు, ఒడిశా, మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విత్తన నిపుణు లు హాజరయ్యారు.
విత్తనం, విత్తన జ్ఞానం, అనుభవాల ప్రదర్శ నలకు ఎర్త్ సెంటర్ లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మామ పద్మారెడ్డి, సిజిఆర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి, రైతులతో కలిసి దేశంలోని వివిధ రకాల విత్తనాలను పరిశీ లించారు.
ఈ సందర్బంగా రైతులు వ్యవసాయంపై తీసుకో వాలిసిన చర్యలు, నెలతల్లిని నమ్ముకున్న అన్నదాత లకు వేదిక పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతులు, స్థానిక నాయ కులు శ్రీనివాస్ రెడ్డి, చేగూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.