calender_icon.png 23 January, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెల్మెంట్ ధరించడం వాహనదారుడి బాధ్యత

23-01-2025 12:22:38 AM

నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ జనవరి 22 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా హెల్మెట్ ధరించాల్సి ఉందని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్,  జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ లు అన్నారు.

బుధవారం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వారితోపాటు జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్, ఆర్టీవో బాలు, డిఎస్పి శ్రీనివాస్, ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.