నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డీ రాజేశ్ బాబు
నాగర్ కర్నూల్ జనవరి 23 (విజయక్రాంతి): పుట్టుకతోనో ఇతర కారణాలతో మానసిక వికలాంగులుగా మారిన ప్రతి ఒక్కరిని చేరదీసి వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డీ రాజేశ్ బాబు అన్నారు.
గురువారం రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి సబిత ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన రెండు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏ పని చేస్తున్నారో బోధపడని మానసిక వికలాంగుల పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ సహృద్భావంతో మెలగాలని వారిపై వివక్ష చూపకుండా రక్షణ కల్పించాలన్నారు.
అందుకు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని ఆ కమిటీ సభ్యులు తప్పనిసరిగా అలాంటి వారిని చేరదీసి ఆదుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ ఎం మధుసూదన్ రావు, శ్యాంప్రసాద్ రావు, ఎస్‌ఆర్ సత్యనారాయణ, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది ఎం.కేశవరెడ్డి, ఎన్.రాజు, ఎం.బాలరాజు, వంశీ, నాగరాజు, శిరీష, సాయి లక్ష్మి పాల్గొన్నారు.