ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైైర్మన్ బక్కి వెంకటయ్య
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులను నియంత్రించే విషయంలో కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. అత్యాచార ఆరోపణలకు సంబం ధించి విచారణ జరుపుతామన్నారు.
త్వరలో లగచర్లలో కమిషన్ పర్యటిస్తుందని, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. ఫార్మా కంపెనీ కారణంగా భూములు కోల్పోతున్న గ్రామస్తులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, సత్యవతిరాథోడ్, నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, అనిల్ జాదవ్, జాన్సన్ నాయక్, రూప్‌సింగ్, బాధిత మహిళలతో కలిసి శనివారం కమిషన్‌కు వినతిపత్రం అందజేశారు.
గిరిజనుల జోలికి వెళ్లొద్దు: సత్యవతి రాథోడ్
రేవంత్‌రెడ్డి పరాకాష్ట పాలనకు లగచర్లలో పోలీసుల అమానుష దాడే ఉదాహరణ అన్నారు. రేవంత్ తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల నుంచి భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. కడుపు కాలి తిరగబడితే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇకనైనా బుద్ధి మార్చుకొని గిరిజనుల జోలికి వెళ్లవద్దన్నారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి రా జ్యాంగేతర శక్తిగా మారాడని మండిపడ్డారు.
పోలీసులపై కేసులు నమోదు చేయాలి: ఆర్‌ఎస్పీ
లగచర్లలో నిజానికి ఎస్సీ, ఎస్టీలపైనే దాడి జరిగిందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. రైతులు దాడి చేశారన్న నెపంతో ఎస్సీ, ఎస్టీ మహిళలపై పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళలు చెబుతున్నారని పేర్కొన్నారు.
వెంటనే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు అత్యాచార కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మహిళలపై చేస్తున్న దమనకాండను రాష్ర్ట ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామన్నారు. కమిషన్ పారదర్శక విచారణ చేపట్టాలని కోరారు.