మహేశ్వరం నియోజకవర్గంలో రూ.69 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
BRS హయాంలో ఒక్క గ్రూప్స్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు: ఐటీ మంత్రి
ఫోర్త్, పార్మాసిటీలతో అపార ఉపాధి, ఉద్యోగ అవకాశాలు: KLR
మహేశ్వరం (విజయక్రాంతి): ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందపర్చిన హామీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
బడంగ్ పేట్ RCI road : ₹32 కోట్లు
తుక్కుగూడలో: ₹15.74 కోట్లు
నేదునూరు PR రోడ్డు : ₹ 17 కోట్లు
UPHC 3 ఆస్పత్రులు..
ఒక్కో దావఖానాకు ₹1.43 కోట్లుతో అభివృద్ధి పనులు ప్రారంభిచారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పేదల సంక్షేమం, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని కొనియాడారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని పేర్కోన్నారు.