calender_icon.png 4 January, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో పాటు ఉన్నత విద్య అవకాశాలు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

01-01-2025 10:56:32 PM

మాజీ మంత్రి జోగు రామన్న...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధం లేకుండా పేదల పక్షాన నిలబడుతూ వారికి ఎల్లవేళలా అండగా నిలుస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రాజుగూడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను మాజీ మంత్రి ప్రారంభించి, స్వయంగా బ్యాటింగ్ చేస్తూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ మేరకు మాజీ మంత్రి రామన్న మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేలా బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఉన్నత విద్య క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ సిడం బాబురావు, నాయకులు పాల్గొన్నారు.