30-03-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తలకొండపల్లి, మార్చి 29 (విజయక్రాంతి) : అన్నెం, పుణ్యం తెలియని పసి పిల్లల ఆకాల మృతి తీవ్ర విషాద సంఘటన అని ఇది తనను తీవ్రంగా కలిచివేసిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మునిసిపాలిటీ పరిదిలో మృతి చెందిన పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతంల సొంత గ్రామం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామం.మృత దేహాలను శుక్రవారం రాత్రి మెదక్ పల్లి గ్రామానికి తెచ్చారు.
విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం మెదక్ పల్లి గ్రామానికి వచ్చి పిల్లల మృత దేహాలపై పులమాలలు వేసి నివాలులర్పించారు.ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు.భాదిత కుటుంబానికి తనవంతుగా రూ.10 వేలను అర్థిక సాయంగా అందజేశారు.
పడకల్‌లో : మండలంలోని పడకల్ గ్రామంలో మహమ్మద్ సుల్తాన్ మృతి చెందారు. ఎమ్మెల్యే నారాయణరెడ్డి శనివారం పడకల్ గ్రామానికి వచ్చి సుల్తాన్ మృత దేహాన్ని సందర్శించి పులమాల వేసి నివాలులర్పించి కుటుంబ సభ్యులను పరమార్శించారు.మృతుని కుటుంబానికి రూ.5 వేలను ఆర్థిక సాయంగా అందజేశారు. ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి, రేన్ రెడ్డి, డేవిడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.