మెదక్ జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్ నరేందర్
మెదక్, అక్టోబర్ 27(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకే డీఏ ప్రకటించడం పట్ల ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారని మెదక్ జిల్లా ఉద్యోగుల ఐకాస చైర్మన్ దొంత నరేందర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మెదక్‌లో జరిగిన సమావే శంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు, ప్రజాప్రభుత్వంలోని రెండు డీఏలు పెండింగ్‌ల విడుదల కోసం ఎదురుచూస్తుంటే.. ఒక డీఏ ప్రకటించడం శోచనీయమన్నారు.
ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయి లో అర్హులకు అం దించడంలో ఉద్యోగులుగా చిత్తశుద్ధి తో పనిచేస్తున్నామని, అదేక్ర మంలో ఉద్యోగు లకు సహజంగా రావాల్సిన కరువు భత్యం ఇవ్వడంలో జాప్యం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరా లోచించి కనీసం మరో డీఏనైనా మంజూరు చేయాలన్నారు. టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, సహ అధ్యక్షులు ఎండీ ఇక్బాల్ పాషా, ట్రెజరర్ ఎం.చంద్రశేఖర్ ఉన్నారు.