calender_icon.png 20 March, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ కూలీలకు కేటాయించకపోవడం బాధాకరం

20-03-2025 12:25:25 AM

సంగారెడ్డి, మార్చి 19, (విజయ క్రాంతి): రాష్ట్ర బడ్జెట్ నిరాశగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నేమ్ చేంజర్ కానీ గేమ్ చెంజర్ కాదు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంకెల గారడిగా ఉంది. నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపానికి ప్రజలను ముంచే బడ్జెట్ ఇది.రేవంత్ రెడ్డి అసమర్ధత వల్ల ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది.

ఇది మంచి ప్రభుత్వం కాదు... ముంచే ప్రభుత్వం... బడ్జెట్ లో రూ.2500 మహాలక్ష్మి ఉసేలేదు కానీ...అందాల పోటీలకు మాత్రం రూ. 250 కోట్లు పెట్టారు.వ్యవసాయ కూలీలకు బడ్జెట్ కేటాయించకపోవడం బాధకరం. రైతులను మోసం చేసేలా ఉంది. ఈ బడ్జెట్ చూసిన తరువాత తెలంగాణ మహిళలు, వృద్ధులు, రైతులు నిరాశకు గురయ్యారు.బడ్జెట్ లో సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వర , బసవేశ్వర ఎత్తిపోతల ప్రస్తావనే లేదు.

చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే, సంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు