18-03-2025 12:00:00 AM
జనగామ, మార్చి 17(విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన సభలో రైతుల కష్టాలపై కనీసం మాట్లాడకపోవడం బాధాకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. జనగామ జిల్లాలో రైతుల పంటలు ఎండిపో యి కన్నీళ్లు పెడుతుంటే వారిని ఆదుకుంటామని ఒక్క హామీ ఇవ్వకపోవడం రైతులపై కాంగ్రెస్‌కు ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
సోమవారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో అహల్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ రైతుల డిక్లరేషన్‌లో రైతులను ఉద్ధరి స్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే అన్నదాతలను విస్మరించిందన్నారు. ప్రవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు వేస్తే చెరువులు, కుంటలు నింపకపోవడంతో రైతులు తీవ్రం గా నష్టపోయారన్నారు.
ముందుచూపుతో చెరువులు, కుంటలు నింపితే రైతులకు పంట లు ఎండిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు. వర్షపు నీరు సముద్రంపాలై రైతుల బతుకులు ఆగమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి రైతుల పరిస్థితులను తీసుకెళ్లాలని, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇచ్చేలా ఒత్తిడి తేవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేష్, రాపర్తి సోమయ్య, బొట్ల శేఖర్ , జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్, పుత్కనూరు ఉపేందర్ , బెల్లంకొండ వెంకటేష్, మునిగల రమేష్, చిట్యాల సోమన్న, కోడెపాక యాకయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.