మాజీమంత్రి కొప్పుల
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పాలనలో దివ్యాంగుల సంక్షేమ శాఖలో భారీ అవినీతి జరిగిందని, ఆ శాఖతో సంబంధం లేని హరీశ్‌రావుపై, తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.500 ఉన్న పెన్షన్‌ను రూ.1500లకు పెంచామని, రెండోసారి కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత రూ.3,016 ఆ తర్వాత రూ.4 వేలకు పెంచినట్లు గుర్తుచేశారు.
విద్యలో ప్రతిభ చూపిన దివ్యాంగులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందించినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ శాఖకు బడ్జెట్ రూ.20 కోట్ల నుంచి రూ.83 కోట్లకు పెంచిందన్నారు. చేతనైతే ప్రజలకు మంచి చేసి చూపెట్టాలన్నారు.