calender_icon.png 27 February, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు..?

26-02-2025 08:51:10 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ రెండవ తేదీన జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన కులగణన అభిప్రాయ సేకరణలో డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్ వర్గీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడడంతో గాయాలు ఆయన సందర్భం నెలకొంది. దీంతో ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ తో పాటు ఆయన అనుచరులు అనిల్ గౌడ్, అసద్, రమేష్, చరణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినట్లు తెలిసింది. ఈ విషయమై పోలీసులు ఇప్పటికీ మీడియాకు వెల్లడించలేదు. కాంగ్రెస్ పార్టీలో నేటికీ ఇరు వర్గాల మధ్య వర్గ పోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో నాయకులు, కార్యకర్తల పరిస్థితి అయోమయం నెలకొంది. డిసిసి ఆయన అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుపై తీవ్రస్థాయిలో పోలీసులపై మరో వర్గీయులు ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.