11-04-2025 12:00:00 AM
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘-అర్జున్ సన్నాఫ్ వైజ యంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. విజయశాంతి హీరో తల్లి పాత్రను పోషిస్తున్నారు. ఏప్రిల్ 18న విడుదల కాను న్న ఈ సినిమా నుంచి ‘ముచ్చటగా బం ధాలే..’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో విజయశాంతి మాట్లాడుతూ..“కళ్యాణ్‌రామ్ తల్లి గురించి ఎంత అద్భుతంగా చెప్పాడు.
తను విలువలు, క్రమశిక్షణ గల మనిషి. ఎన్టీ రామారావు మనవడు. ఆ క్రమశిక్షణ ఎక్కడికి పోతుంది” అన్నారు. హీరో కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. “ఒక అమ్మ ప్రాణాన్ని పణం గా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. అదే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి” అని చెప్పారు.
డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. ‘మనం పుట్టగానే అమ్మ ప్రతి బర్త్ డేకి కేక్ కట్ చేస్తుంది. అది సెలబ్రేషన్. మనం పెద్దయ్యాక అమ్మ బర్త్‌డేను గుర్తు పెట్టుకుని కేక్ కట్ చేయాలి. అది ఎమోషన్. అదే ఈ సినిమాలో చూపించాలనుకున్నాం’ అన్నారు. నిర్మాత అశోక్ వర్ధన్ ముప్పా మాట్లాడుతూ.. ‘విజయశాంతి సినిమాను ఒప్పుకోవడమే మా ఫస్ట్ సక్సెస్’ అని చెప్పారు. హీరోయిన్ సయీ మంజ్రేకర్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.