05-04-2025 12:27:48 AM
షీటీం ఇంచార్జి విజయలక్మి
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 4 (విజయక్రాంతి) మన పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని చట్టాలపై సంపూర్ణ అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా షిటీం ఇన్చార్జ్ విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపు లు, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలకార్మికులు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ క్రైం, సైబర్ బెదిరింపులు, వేసవి సెలవులో వేధింపులు ఇలాంటి వాటిపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు వేధింపుల కు గురైతే షీటీం అండగా ఉంటుందని, ఫి ర్యాదులు ఇచ్చిన వారి విషయాలు గోప్యం గా ఉంచుతామన్నారు. వేదిపులకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షలు ఉంటాయని ఎవరైనా పోకిరీలు అమ్మాయిలను విద్యార్థులను ఉద్దేశించి అసబ్యంగా ప్రవర్తించిన, అసబ్యంగా మాట్లాడిన,వాళ్ళతో ఫోటోలు దిగి మోసం చేసిన, ఎప్పుడో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి వేరే వాళ్లకు షేర్ చేసి బెదిరించి ఇబ్బందులకు గురిచేస్తే షీ టీం బృందం తప్పక చర్యలు తీసుకుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో షీ టీం మెంబెర్ వెంకట్ రాథోడ్, పాఠశాల ఇంచార్జి సలెహబేగం, విద్యార్థులు పాల్గొన్నారు.