calender_icon.png 1 February, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెక్క పక్కాగా ఉంటేనే ఉపయోగం

01-02-2025 12:40:28 AM

  • నేటి నుంచి తాగునీటి వనరుల సర్వే 
  • వేసవిలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు 

సూర్యాపేట, జనవరి31(విజయక్రాంతి): రానున్న ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేసవిలో  పక్కా ప్రణాళికతో తాగునీటిని అందించేందుకు అధికారులు సిద్ద అవుతున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు పది రోజులపాటు ఎంపిక చేసిన గ్రామాల్లో పర్యటించి రోజూ వారి నీటి సరఫరాను పర్యవేక్షించనున్నారు. తాగునీటి వనరులు, నీటి సరఫరాను పరిశీలించి ప్రణాళిలకు రూపొందించను న్నారు.

ఈ ప్రణాళికల  ఆధారంగానే వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించవలసి ఉన్నది.  అధికారులు కార్యాలయాల్లో కూర్చోని ప్రణాళికలు రూపొందించకుండా క్షేత్రస్థాయిలోకి వెళితేనే లెక్క పక్కాగా ఉండనున్నది. లెక్క పక్కాగా ఉంటేనే సర్వే వల్ల ఉపయోగం కలుగనున్నది.

సర్వే ఇలా...

జిల్లాలోని అన్ని మండలాలలో మండల ఇరిగేషన్ ఏఈలు, మండల అభివృద్ది అధికారులు, గ్రామ కార్యదర్శు లతో టీమును ఏర్పాటు చేశారు. ఈ బృందం గ్రామాల్లో పర్యటించి నీటి వనరుల లెక్క అంటే అందుబాటులో ఉన్న బోరుబావులు, చేతి పంపులు,నీటి ట్యాంకులు, ఇతర నీటి వనరుల లెక్క తేల్చాలి.

మరమత్తులు ఉంటే గుర్తించి రిజిస్టర్లో పొందపర్చాలి. గృహాల అవసరం మేరకు నీటి  సరఫర లేకుంటే రిజిష్టర్లో నమోదు చేయల్సి ఉంటుంది.  అన్ని సక్ర మంగా జరిగితే వేసవిలో అవసరం మేరకు నీటికి అందించే అవకాశం ఉంటుంది. 

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

జిల్లాలోరానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాము. పది రోజుల పాటు ప్రత్యేక కార్యచరణ చేపట్టి తాగునీటి వనరుల అవసరాలను గుర్తిస్తా ము.  మండల అధికారులు అందించిన ప్రణాళిక మేరకు ఏర్పాట్లు చేస్తాము.

 వై. శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఇంట్రా, ఈఈ