calender_icon.png 31 October, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమెను ఆపడం ఎవరి తరం కాదు

04-08-2024 12:29:23 AM

పారిస్: అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ పారిస్ విశ్వక్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం మహిళల వాల్ట్ ఫైనల్లో బైల్స్ విజేతగా నిలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఈ విభాగంలో స్వర్ణం గెలవడం బైల్స్‌కు ఇది రెండోసారి. గతంలో రియో ఒలింపిక్స్‌లో వాల్ట్ పోటీల్లో స్వర్ణం నెగ్గింది. ఇక ఓవరాల్‌గా బైల్స్‌కు ఇది ఏడో స్వర్ణ పత కం. రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు నెగ్గిన పారిస్‌లో ఇప్పటికే మూడు పసిడి పతకాలు సొంతం చేసుకుంది. ఇక సోమవారం బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఈవెంట్స్‌లోనూ బైల్స్ స్వర్ణం సాధిస్తే ఈసారి అన్ని ఈవెంట్లలో స్వర్ణం నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా బైల్స్ చరిత్ర సృష్టించనుంది.