మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరు తో సెలెక్టెడ్ దాడులు చేస్తోందని, బయటకు అక్రమ నిర్మాణాలు కూల్చుతున్నామని చెబుతున్నా, తీసుకుంటున్న చర్యలు అనుమానాస్పదం గా ఉన్నాయని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. పాలమూరులో పేద ఇండ్లు కూల్చివేత, హైడ్రా పేరు తో ప్రభుత్వ చర్యలపై శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. హైడ్రా కార్యాలయమే అలుగులో ఉందని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారని, నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ పార్కు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయ ని చెప్పారు.
ఏ నిర్మాణాలు సరిదిద్దగలం? ఏవి సరిదిద్దలేమనే విచక్షణ లేకుండా తీసుకుంటున్న ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలు బాధితులు అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాలమూరులో 75 మంది దివ్యాంగు లు, దళితులైన పేదల ఇండ్లు కూల్చ డం దుర్మార్గమని ధ్వజమెత్తారు. గురుకులాల విద్యార్థులే కాకుండా అక్కడి ఉపాధ్యాయులు కూడా ఆందోళన చేసే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. రేవంత్ ప్రభుత్వ 9 నెలల పాలన చూస్తుంటే పనిగట్టుకుని సొంత పార్టీ ని ముంచే ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా? అన్న అనుమానాలు తలెత్తున్నాయని పేర్కొన్నారు.