13-04-2025 12:00:00 AM
మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల, ఏప్రిల్ 12 : తెలంగాణలో కేసీఆర్ పేరును చేరిపేయడం రేవంత్ రెడ్డి తరం కాదని.. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మొయినాబాద్ మండలంలోని స్టార్ కన్వెన్షన్ హాల్లో బీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్య క్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సన్నాహాక సమావే శానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 27 న వరంగల్ లో బీఆర్ ఎస్ 25 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నామని.. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చూశామని, ఏడాదిన్న రేవంత్రెడ్డి పాలన చూస్తున్నామని .. ఎవరేంటో ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. సంవత్సరం నుండి ఎవరిని కదిలించినా కేసీఆర్ను ఓడగొట్టుకుని తప్పు చేశామని అంటు న్నారన్నారు .
రేవంత్ రెడ్డి రెండు విడతలు రైతుబంధు ఎగ్గొట్టాడని, కేసీఆర్ ఉంటే అదునుకు డబ్బులు వేసేవాడని ప్రతి రైతు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు . ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు అందరం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఏస్ చైర్మన్ పట్ళోళ్ళ కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్య‘డు పట్నం అవినాన్రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్య‘రాలు స్వప్న, తెలంగాణ ఉద్యమకారుడు దేశమళ్ళ ఆంజనేయులు, కనీస వేతనాల మాజీ చైర్మన్ నారాయణ, శంకర్పల్లి మాజీ ఎంపీపీ గోవర్దన్రెడ్డి, మొయినాబాద్ మాజీ ఎంపీపీ జయవంత్, ఆయా మండలాల పార్టీ అధ్య‘లు దారెడ్డి వెంకట్రెడ్డి, గూడూరు నర్సింగ్గావు, పెద్దోళ్ళ ప్రభాకర్, గోవర్దన్రెడ్డి, దయాకర్రెడ్డి, మార్కెట్ కమిటీల మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్ గౌడ్, పాపారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.