యోగి రజాకార్ వ్యాఖ్యలపై ప్రియాంక్ ఖర్గే ఫైర్
ముంబై, నవంబర్ 14: తన తండ్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. తన తండ్రి ఖర్గే చిన్ననాటి విషాదాన్ని యోగి ప్రస్తావించడంపై మండిపడ్డారు. ఆ సంఘటనను కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలేదని అన్నారు. 1948లో తన తండ్రి ఇంటిని తగులబెట్టింది హైదరాబాద్ నిజాం రాజాకార్లని.. ఈ చర్యను మొత్తం ముస్లిం సమాజానికి ముడిపెట్టి చూడటం సరికాదని అన్నారు.
కేవలం బీజేపీ లాంటి మతతత్వ పార్టీ మాత్ర మే ఇలాంటి వాటిని రాజకీయం చేయగలదని ప్రియాంక్ విమర్శించారు. ప్రతి సంఘ ంలో మంచి, చెడు ఉంటాయి. నిజాం రజాకార్లు చేసింది తప్పేనని.. అయితే దీనిని మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదించడం కరెక్టు కాదన్నారు.