calender_icon.png 22 April, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనులను అవమానించడం తగదు

21-04-2025 12:38:20 AM

  1. ప్రొటోకాల్ ను మరిచిన అధికారులు 

వెంటనే ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి

భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తిరుపతి నాయక్ 

గోపాలపేట ఏప్రిల్ 20: పదవిలో ఉన్న గిరిజనులను అవ మానించడం తగదని భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తిరుపతి నాయక్ హెచ్చరించారు. ఆది వారం గోపాలపేట మండల కేంద్రంలోని విలేకరుల సమావే శంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి మండలా కాంగ్రెస్ పార్టీ ఇ న్చార్జ్ .సత్య శిలారెడ్డి ఎలా ప్రారంభిస్తారు అని ఆగ్రహించారు.

అధికారులు కాంగ్రెస్ నాయకుల చేతుల్లో కీలుబొమ్మల్లా పని చేస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యక్రమాల పనులు జరిపించేందుకు ప్రజాప్రతినిధులు లేకుంటే అధికా రులే నిర్వహించాలి ఆ విషయం కూడా తెలియకుండా అధికారులు మత్తులోనే ఉన్నారా అన్నారు. గోపాలపేట, రేవల్లి, మండలాల్లో ఐకెపి, సింగిల్ విండో ఆధ్వర్యంలో జరుగుతున్న వరిధాన్ని కొనుగోలు కేంద్రాలను ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సత్యశిలారెడ్డి ఎందుకు ప్రారంభిస్తారని ధ్వజమెత్తారు.

గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో అదే గ్రామానికి చెందిన డిసిఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్ ఉన్నాడు. కానీ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా అతనిని పిలిపించి అవమానించడం ఏంటని ప్రశ్నించారు.

ఎక్కడ చూసినా గిరిజన నాయకులను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వనపర్తి ఎమ్మెల్యే మేగా రెడ్డి స్పందించి సమాధానం చెప్పాలన్నారు. వనపర్తి జిల్లాలోని గిరిజనులంతా ఏకం కావాలని ఇలా ఎక్కడపడితే అక్కడ గిరిజనులను  అవమానించకుండా ఖండించాలన్నారు.