calender_icon.png 29 November, 2024 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీలో ఇక కొలువుల జాతరే!

29-11-2024 01:29:12 AM

రాబోయే 6 నెలల్లో 10-12% వృద్ధి

  1. 2030 కల్లా అందుబాటులో 10 లక్షల కొలువులు
  2. హైదరాబాద్‌లో నైపుణ్యం ఉన్న మానవ వనరులు అధికం
  3. దేశవ్యాప్త జాబితాలో రెండో స్థానంలో మన నగరం
  4. క్వెస్ కార్ప్ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 28 (విజయ క్రాంతి): ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన వృద్ధిరేటు కనబర్చేది ఐటీ రంగం అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధిలో ఐటీ రంగం మొదటి స్థానంలో నిలుస్తుంది. కానీ కరోనా విలయం తర్వాత ఒక్కసారిగా ఐటీ ప్రపంచమంతా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నది.

లేఆఫ్స్ కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. కానీ అనతి కాలంలోనే మళ్లీ ఐటీ రంగం పుంజుకుంటున్నది. గతంతో పోలిస్తే మళ్లీ ఐటీకి భారీగా డిమాండ్ పెరుగుతోంది.

భవిష్యత్‌లో ఐటీ రంగంలో అద్భుతమైన ఉద్యోగావకాశాలు రానున్నట్టు క్వెస్ కార్ప్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా అన్ని నగరాలతో పోలిస్తే హైదరా బాద్ నగరంలో మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యమున్న మానవ వనరులు అందుబాటులో ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. 

10-12 శాతం పెరుగుదల

రాబోయే ఆరు నెలల్లో ఐటీ సేవల విభాగంలో నియామకాలు 10 నుంచి 12 శాతం మేర పెరిగే అవకాశాలున్నట్టు క్వెస్‌కార్ప్ నివేదిక స్పష్టం చేసింది. కొత్త కొత్త సాంకేతికతల రావడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థల స్థితిగతులు మారుతుండటంతో ఈ స్థాయి లో వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది.

జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటిం గ్ వంటి కొత్త సాంకేతికతలు 2030 కల్లా 10 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టిస్తాయని వివరించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీసీసీ, సైబర్ సెక్యూరిటీ రంగం అద్భుత ప్రదర్శన కనబర్చింది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌లో నిపుణులకు 71 శాతం, సైబర్ సెక్యూరిటీ రంగంలో 58 శాతం నిపుణులకు డిమాండ్ పెరిగిందని నివేదిక వెల్లడించింది. 

నైపుణ్యంతో డిమాండ్

ఐటీ రంగంలో నైపుణ్యంపైనే మానవ వనరుల వృద్ధి రేటు ఆధారపడి ఉంటుంది. ఈఆర్‌పీ, డెవలప్‌మెంట్, టెస్టింగ్, డేటాసై న్స్, నెట్ వర్కింగ్ వంటి నైపుణ్యాల విభాగం నిపుణులకు సగటున 79 శాతం డిమాండ్ పెరిగింది. సైబర్ సెక్యూరిటీ 20 శాతం, జా వా 30 శాతం, డెవాప్స్ 25 శాతం డిమాండ్ పెరిగిందని నివేదికలో తెలిపింది. 

నిపుణుల కు ఉద్యోగాలు కల్పించడంలో ఐటీ రంగం ముందంజలో ఉన్నది.  నిపుణులకు ఐటీలో 37 శాతం డిమాండ్ ఉన్నట్టు సర్వేలో తేలిం ది. తర్వాత స్థానాల్లో కన్సల్టింగ్ 11 శాతం, మ్యానుఫ్యాక్చరింగ్ 9 శాతం, బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల  సంస్థల్లో నిపుణులకు 8 శాతం ఉద్యోగాల లభిస్తున్నాయి. 

నిపుణుల జాబితాలో రెండో స్థానం 

దేశంలో నిపుణుల నియామకాల్లో జీసీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డెవాప్స్, అనలిటిక్స్ వంటి సాంకేతికత అవసరం ఉన్న ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉండటం దీని కి ప్రధాన కారణమని నివేదికలో పేర్కొ ంది. నైపుణ్యమున్న మానవవనరులకు అధిక డిమాండ్ ఉన్న నగరాల్లో 43.5 శాతంతో బెంగళూరు ప్రథమస్థానంలో, హైదరాబాద్ 13.4 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. 

10 శాతం డిమాండ్‌తో పూణె మూడో స్థా నంలో, 7.3 శాతంతో ఢిల్లీ నాలుగో స్థానం లో, 7 శాతంతో చెన్నై ఐదో స్థానంలో, 4.2 శాతంతో ముంబై ఆరో స్థానంలో ఉన్నాయి.  ద్వితీయ శ్రేణి, తృతీయశ్రేణి నగరాల్లో కూడా ఐటీ నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది.