calender_icon.png 2 October, 2024 | 4:14 AM

అవసరం కాబట్టి ఆ సీన్లలో నటించక తప్పదు

02-10-2024 12:48:28 AM

దక్షిణాది, ఉత్తరాది అని కాకుండా దాదాపు అంతటా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. తెలుగుతోపాటు తమిళం, హిందీలో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా ఇప్పటికీ అదే హవా కొనసాగిస్తోంది. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌లు, ప్రత్యేక గీతాల్లో నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది.

ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన తమన్నా ఇటీవల స్త్రీధూవి2లో ఓ ప్రత్యేక గీతంతో అలరించింది. ఈ నేపథ్యంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె శృంగార సన్నివేశాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘చాలా మంది హీరోయిన్లు రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఇబ్బందిపడతారు.

మరికొందరు అవలీలగా నటించి మెప్పిస్తారు. ఇప్పటి హీరోయిన్లు రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటిస్తున్నారు. శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎక్కడ కో స్టార్‌కు ఇబ్బందవుతుందోనని చాలా మంది హీరోలు అనుకుంటారు. ఎదుటివాళ్లు అసౌకర్యంగా ఫీల్ అవుతారని, ఆ సీన్స్ చేసేప్పుడు నటి ఎలా ఫీల్ అవుతుందో అనే సందేహాలు వారి మదిలో కలుగుతాయి.

అందుకే రొమాంటిక్ సీన్లు, శృంగార సన్నివేశాల్లో నటించడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఆ సీన్స్ సినిమాకు అవసరం కాబట్టి తప్పనిసరై నటిస్తారు’ అని చెప్పుకొచ్చిందీ చిన్నది. ఇక మిల్కీ బ్యూటీ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘ఓదెలెే2’లో, హిందీలో ‘వేదా’తోపాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.