06-04-2025 12:04:56 AM
“నన్ను అందరూ అడుగుతుంటారు.. రాముడి పాత్రలో నటించడం కష్టమా? రావణుడిగా చేయడం సులభమా? అనీ..! రాముడిగా చేయడమే కష్టం. ఎందుకంటే జీవితంలో ఇన్నోసెంట్‌గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం. కానీ, ‘మ్యాడ్‌స్కేర్’లో లడ్డు పాత్ర పోషించిన విష్ణు ఆ ఇన్నోసెన్స్‌ను బాగా ప్రదర్శించాడు.
విష్ణు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో! ఆయనలో ఆ ఇన్నోసెన్స్ లేకపోతే ఈ సినిమాలో కామెడీ ఇంతలా వర్కౌట్ అయ్యేది కాదు” అన్నారు స్టార్ హీరో ఎన్టీఆర్. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ‘మ్యాడ్‌స్క్వేర్’ చిత్రం మార్చి 28న విడుదలై.. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేదికపై మాట్లాడిన ఎన్టీఆర్ యువ నటుడు విష్ణు గురించి పైవిధంగా స్పందించారు. ‘నవ్వించగలిగే మనిషి అరుదుగా దొరుకుతారు. ‘మ్యాడ్2’ రూపంలో కళ్యాణ్‌శంకర్ మనకు దొరికాడు’ అని చిత్ర దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. ఇంకా ఆయన ప్రసంగిస్తూ.. “నా పెళ్లప్పుడు రామ్‌నితిన్ చిన్న పిల్లోడు.
మాట్లాడేందుకే భయపడేవాడు. ఓరోజు ‘బావా, నేను యాక్టర్ అవుతా..’ అని ధైర్యంగా చెప్పాడు. నేనూ అంతే ధైర్యంగా నీ ఇష్టమొచ్చినట్టు చేసుకోపో అని చెప్పా. అలా నా నుంచి ఏ సపోర్టూ లేకున్నా ముందుకెళ్లాడు. ఇప్పుడు అతని సక్సెస్ చూసి గర్వంగా ఉంది.
మ్యాడ్‌లో రామ్‌నితిన్ అద్భుతంగా నటించాడు” అని తెలిపారు. ఇంకా ఈ వేడుకలో చిత్ర కథానాయకులు నార్నె నితిన్, సంగీత్‌శోభన్, రామ్‌నితిన్, విష్ణు ఓఐ, దర్శకుడు కళ్యాణ్‌శంకర్, నటీనటులు సునీల్, ప్రియాంక జవాల్కర్, రెబా మోనికా జాన్, మిగతా చిత్రబృందం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.