05-04-2025 07:59:41 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నర్సింహారెడ్డి అన్నారు. శనివారం దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. రేషన్ దుకాణాల్లో ఇస్తున్న ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యంలో ఐదు కేజీలు కేంద్ర ప్రభుత్వం వాటా కాగా ఒక కేజీ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకుండా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. రేషన్ బియ్యం పంపిణీలో సొమ్మొకరిది సోకొకరిది అన్న చందాన ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫోటో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుమ్మరి నర్సింలు కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు రాజి రెడ్డి, భాను, స్వామి, దుర్గదాస్, స్వామి గౌడ్, కర్ణాకర్, స్వామి, నరేష్, నాగేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.