calender_icon.png 22 November, 2024 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అసాధ్యం

22-11-2024 02:23:26 AM

మాజీ మంత్రి గంగుల కమలాకర్ 

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం సీఎం రేవంత్ తరం కాదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉందన్నారు.

సీఎం వేములవాడకు వస్తే ఉమ్మడి జిల్లాకు ఏమైనా ప్రకటిస్తారని జనం ఆశిస్తే.. ఎంతసేపు కేసీఆర్ జపం తప్ప మరో విషయం మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. తట్టెడు మట్టి తీయని రేవంత్.. విమర్శలు మాని పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. 

ఒప్పించి భూ సేకరణ చేశాం: కొప్పుల ఈశ్వర్

రేవంత్‌రెడ్డి మాట్లాడితే అరెస్టులు చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. వేములవాడ, సిరిసిల్లలో కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టు సృష్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తమ హయాంలో రైతులను ఒప్పించి భూసేకరణ చేశామని, ఫార్మా సిటీ ఉండగా మళ్లీ ఫార్మాకు భూ సేకరణ ఎందుకని ప్రశ్నించారు. 40 ఏళ్ల తన రాజకీయ చరిత్రలో ప్రజల చేత ఈ స్థాయి విమర్శలు ఎదుర్కొన్న సీఎం రేవంత్ ఒకరేనన్నారు. 

సచివాలయంలో సెటిల్మెంట్లు: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

కేసీఆర్‌ను విమర్శించకుండా ఇప్పటివరకు సీఎం రేవంత్ సభ జరగలేదని, ఆయన నిర్మించిన సచివాలయంలో కూర్చొని సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. సిటీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కేసీఆర్ కట్టించారని, దానిని తొలగించడం రేవంత్‌కు సాధ్యపడుతుందా? అని ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో కేటీఆర్ సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని నిలదీశారు. రేవంత్ బెదిరింపులకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భయపడే ప్రసక్తి లేదన్నారు.