26-03-2025 10:19:00 PM
డ్రగ్ ఇన్స్పెక్టర్ జి.అశ్విని..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధమని డ్రగ్ ఇన్పె పెక్టర్ జి.అశ్విని తెలిపారు. బుధవారం రెబ్బెన మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్రకటనలు ఉన్న కారిఫోర్డ్ సిరప్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ 1954 చట్టం ప్రకారం మందుల లేబుళ్లు కవర్లపై ప్రకటనలు ఇవ్వడం చట్టవిరుద్దమని, కారిఫోర్డ్ సిరప్ పై జ్వరాన్ని తగ్గిస్తుందని ముద్రించారని, ఇలా ముద్రించిన తయారీ సంస్థ తిరుపతి మెడికేర్-హైదరాబాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.