calender_icon.png 4 April, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందడం హర్షనీయం

03-04-2025 04:48:19 PM

మేడ్చల్ (విజయక్రాంతి): పార్లమెంటులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం హర్షనీయమని బిజెపి రాష్ట్ర నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. బిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టి, బిసి, ఓసి, ముస్లిం, క్రిస్టియన్, దేవాలయాల భూములు కాపాడుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. ఇతరులు, ప్రభుత్వ భూములు తమవేనని వక్ఫ్ బోర్డు గెజిట్ జారీ చేసుకోవడం వల్ల అనేకమంది ఆస్తులు కోల్పోయారన్నారు. ఇకనుంచి ఇలాంటి అవకాశం ఉండదని, ఎవరి భూములపై వారికే హక్కులుంటాయన్నారు.