calender_icon.png 3 April, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోర్ బోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చడం హర్షనీయం

29-03-2025 12:14:52 AM

జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ లింగం నాయక్

ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబురాలు

మహబూబ్ నగర్ మార్చి 28 (విజయ క్రాంతి) : గోర్ బోలి లంబాడ భాషను 8వ షెడ్యూల్లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడం హర్షనీయమని జిల్లా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ లింగం నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివాసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, బెల్లయ్య నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జిల్లా చైర్మన్ లింగం నాయక్ మాట్లాడుతూ దేశంలోని 11 రాష్ట్రాల్లో 15 కోట్ల మంది లంబాడి భాష మాట్లాడుతారని అన్నారు. హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడేది లంబాడి భాషయేనని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గోర్ బోలి లంబాడ భాషను 8వ షెడ్యూల్ చేర్చడాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్రంలోని బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొంది గోర్ బోలి లంబాడ భాషను 8వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ రాములునాయక్, పట్టణ అధ్యక్షులు పాతావత్ రవి నాయక్, మాజీ జెడ్పీటీసీ చందర్ నాయక్, నాయకులు యాదగిరి నాయక్, రాంచందర్ నాయక్, గోవర్ధన్ నాయక్, డాక్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.